ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా అనుష్క క్రేజ్ చెక్కుచెదరలేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం అనుష్కని అభిమానించే ఆడియన్స్ వున్నారు. ప్రత్యేకంగా అనుష్క కోసం థియేటర్లకు వచ్చే సినీ ప్రియులు వున్నారు. చివరిగా వచ్చిన అనుష్క 'భాగమతి' యాబై కోట్ల క్లబ్ లో చేరడం అనుష్క సోలో స్టామినాకు మరోసారి అద్దం పట్టింది. అన్ని సక్రమంగా వుంటే ఈ పాటి నిశ్శబ్దం కూడా అనుష్క ఫ్యాన్స్ ని అలరించేది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోయాయి. అనుష్క చాలా ఓపిక పట్టింది. కానీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. సినిమా అంటే డబ్బుతో కూడిన వ్యవహారం.
సినిమా కోసం తెచ్చిన వడ్డీలు కరోనా కేసులు కంటే దారుణంగా పెరిగిపోతాయి. అందుకే మరో ఆప్షన్ లేక ఓటీటీ రిలీజ్ అంగీకరించింది అనుష్క. అయితే ఇలా ఒటీటీకి అంగీకరించే క్రమంలో చాలా ఫీలైయిందట స్వీటీ. ''మనం థియేటర్ కోసం సినిమా తీసాం. నా కెరీర్ లో పూర్తిగా ఫారిన్ షూటింగ్ వున్న సినిమా. టెక్నికల్ గా చాలా గ్రాండియర్ గా వచ్చింది. మంచి విజువల్స్. అభిమానులతో కలసి పెద్ద స్క్రీన్ లో చూడాలని అనుకున్నా. కానీ ఓటీటీ రిలీజ్ చేయల్సివస్తుందని అనుకోలేదు. అయిష్టంగానే ఒప్పుకుంటున్నా'' అని దర్శక నిర్మాతల దగ్గర కొంచెం ఎమోషనల్ గానే చెప్పిందట స్వీటీ. నిజమే అనుష్క సినిమా అంటే ఓ హీరో రేంజ్ క్రేజ్.
బాహుబలి తర్వాత అనుష్క ని ప్రేక్షకులు మరింత వోన్ చేసుకున్నారు. అనుష్క సినిమా థియేటర్ హంగామానే వేరు. కానీ కరోనా కారణంగా థియేటర్ కాస్త ఇలా అర చేతికి సైజుకి రావడం అటు అనుష్క అభిమానులు కూడా నిరాశ పరిచిన విషయమే.