బాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్.. బయటపడి, అందులో సెలబ్రెటీల పేర్లు బయటకు రావడం సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇది వరకే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఎన్‌సీబీ అధికారులకు కీలక సమాచారం అందించిందని, అందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిందని ఇది వరకే వార్తలొచ్చాయి. కానీ.. రకుల్ పేరేం బయటకు రాలేదని ఎన్‌సీబీ అధికారులు చెప్పినట్టు మరో వార్త బయటకు వచ్చింది. దాంతో వార్త ఛానళ్లపై రకుల్ కోర్టుకెక్కింది. తనగురించి వార్తలు రానివ్వకుండా చూడమని కోర్టులో పిటీషన్ వేసింది.
న్యాయ స్థానం కూడా అందుకు అనుగుణంగానే తీర్పు ఇచ్చింది. దాంతో కథ సుఖాంతం అయ్యిందనుకున్నారు. కానీ సీన్ ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో రకుల్ ఇంకా పూర్తిగా బయటపడలేదని, త్వరలో ఎన్‌సీబీ అధికారులు రకుల్ ని విచారించే అవకాశం ఉందని మరో వార్త షికారు చేస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే రకుల్ ని నోటీసులు పంపించారని, అతి త్వరలోనే ఎన్ సీబీ అధికారుల ముందు రకుల్ హాజరు అవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ఇది నిజమో, కాదో తెలీదు గానీ, బాలీవుడ్ లో వార్తా సంస్థలు మాత్రం రకుల్ పేరుని మరోసారి వాడేసుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.