ఫ్యాన్స్‌కి 'సైలెన్స్‌' ట్రీట్‌ ఇచ్చిన స్వీటీ!

మరిన్ని వార్తలు

స్వీటీ బ్యూటీ అనుష్క ఫ్యాన్స్‌కి ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం స్వీటీ 'సైలెన్స్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీ. మాధవన్‌ హీరోగా నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి సంబంధించి అనుష్క లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఒకటి ఇచ్చింది. ఈ అప్‌డేట్‌కే ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్‌ ఏంటంటే, సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసి, 'త్వరలోనే స్పాట్‌లైట్‌లోకి వస్తున్నా.. సైలెన్స్‌..!' అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్‌ ఇచ్చింది. బ్యాక్‌ గ్రౌండ్‌లో రెడ్‌ కలర్‌ ఉన్న ఓ బిగ్‌ స్టేజ్‌.

 

ఆ స్టేజ్‌పై నిలబడి ఉన్న అనుష్క, చేతిలో ఓ బుక్‌ కనిపిస్తోంది. బహుశా ఏదో స్పీచ్‌ ఇస్తున్నట్లుగా ఉందీ స్టిల్‌. అంతకు మించి ఇంకేమీ అర్ధం కావడం లేదు ఈ ఫోటోకి సంబంధించి. అయినా తొందరెందుకులెండి. ఇంతవరకూ షూటింగ్‌ మాత్రమే జరుపుకుంటోందనుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి, స్వీటీ పుణ్యమా అని, ఫస్ట్‌ అప్‌డేట్‌ ఎలాగూ వచ్చేసింది. స్టార్ట్‌ అయ్యింది కాబట్టి, మెల్లమెల్లగా అప్‌డేట్స్‌ వస్తూనే ఉంటాయి.

 

బైలింగ్వల్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హేమంత్‌ మధుకరన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగమ్మాయి అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు మైఖేల్‌ మ్యాడిసన్‌ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇటీవలే షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ చిత్రం అప్పుడే సగానికి పైగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌లో కోన వెంకట్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS