విజ‌య్‌ని టెన్ష‌న్ పెడుతున్న కామ్రేడ్‌

మరిన్ని వార్తలు

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అందుకే త‌క్కువ కాలంలోనే స్టార్ డ‌మ్ సంపాదించేసుకున్నాడు. అయితే ఈ స్టార్ డ‌మ్‌ని కాపాడుకోవ‌డం అంత తేలిక కాద‌న్న విష‌యం త‌న‌కీ తెలుసు. మ‌ధ్య‌లో ఒక్క సినిమా బోల్తా ప‌డినా - మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్తుంది. అందుకే... త‌దుప‌రి సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు.

 

త‌న కొత్త సినిమా `డియ‌ర్ కామ్రేడ్‌`. ఈనెలలోనే విడుద‌ల అవుతోంది. ఈ సినిమా విష‌యంలో విజ‌య్ చాలా టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ని టాక్‌. `డియ‌ర్ కామ్రేడ్‌`పై అటు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ, ఇటు ప్రేక్ష‌కుల‌లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి. విజ‌య్ గ‌త సినిమాల‌కంటే ఎక్కువ బిజినెస్ చేసుకున్న సినిమా ఇది. విజ‌య్ ఇమేజ్‌, రేంజ్ మ‌రింత పెర‌గాలంటే, క‌నీసం స్ట‌డీగా ఉండాలంటే - ఈ సినిమాని హిట్ చేసుకోవాల్సిందే. అందుకే... కామ్రేడ్ విష‌యంలో విజ‌య్ చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడ‌ట‌. `ఈ సీన్లు తేలిపోతాయ్‌` అనుకున్న‌వాటిని మ‌ళ్లీ చెక్ చేసుకుని, రీషూట్లు పెట్టేశాడు.

 

అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ కొన్ని భ‌యాలు దేవ‌ర‌కొండ‌ని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే విడుద‌ల‌కు ముందు కూడా.. రీషూట్లు ప్లాన్ చేశాడ‌ట‌. త్వ‌ర‌లో ర‌ష్మిక‌తో కొన్ని సన్నివేశాల్ని మ‌ళ్లీ తెర‌కెక్కించాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. విడుద‌ల ముందు వ‌ర‌కూ ఇలాంటి ఫినిషింగ్ ట‌చ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాల‌ని, బెట‌ర్ కాపీనే బ‌య‌ట‌కు వ‌దలాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయ్యాడు దేవ‌ర‌కొండ‌. ఈ ప్ర‌య‌త్నం మంచిదే. కాక‌పోతే ఇన్నిసార్లు సినిమాని కెలుక్కుంటూ వెళ్ల‌డం క‌రెక్ట్ కాద‌న్న‌ది మ‌రో భ‌యం. ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS