కన్‌ఫ్యూజ్‌ చేసేస్తున్నావ్‌ స్వీటీ!

మరిన్ని వార్తలు

థర్టీ ప్లస్‌ వయసులోనూ టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్‌లో ప్రతిష్టాత్మక సినిమాలు చేసేస్తూ, టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న అనుష్క, సినిమా కోసం ఎలాంటి రిస్క్‌ చేయడానికైనా వెనుకాడదు. అదే ఆమెని మిగతా హీరోయిన్లందరిలోకీ ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చేసిందని చెప్పక తప్పదు. అనుష్క తాజా సినిమా 'భాగమతి'లోనూ ఆమె చాలా చాలా అద్భుతాలే చేసేసిందట. అవేంటన్నది తెరపైనే చూడాలంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 

అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా కోసం అనుష్క చాలా సన్నబడి కన్పిస్తోంది. అయితే ప్రోమోస్‌లో ఒకలా, సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చినప్పుడు ఇంకొకలా అనుష్క కనిపిస్తుండడంతో అంతా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. 'సైజ్‌ జీరో' సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క, అప్పటినుంచీ ఆ అధిక బరువుతో ఇబ్బంది పడుతోందనీ అస్సలు సన్నబడలేకపోతోందనీ ఈ మధ్యనే చెన్నయ్‌లో 'భాగమతి' తమిళ వెర్షన్‌ ప్రమోషన్‌ సందర్భంగా ఆమెని చూసినవారు అనుకున్నారు. 

హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్‌ ప్రమోషన్‌కి వచ్చినప్పుడు అనుష్కని చూసినవారు మాత్రం కొంత ఆశ్చర్యపోయారు. మరీ అనుష్క లావైపోలేదనీ 'భాగమతి'కి తగ్గట్టుగానే ఉందని మెజార్టీ అభిప్రాయపడుతున్నారు. అనుష్క ఫిజిక్‌ విషయంలో ఈ కన్‌ఫ్యూజన్‌ ఆశ్చర్యకరమే. ఆమె యోగా టీచర్‌. తగ్గాలనుకుంటే సహజ పద్ధతుల్లోనే తగ్గిపోవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె విదేశాలకు వెళ్ళి లైపోసక్షన్‌ చేయించుకుందనే గాసిప్స్‌ విన్పించాయి. 

అయితే ఆ లైపోసక్షన్‌ తాలూకు ఆనవాళ్ళు (ఫేస్‌లో ఛేంజెస్‌ వచ్చేస్తాయి) కన్పించడంలేదు. బయట కన్పించే అనుష్కకీ సినిమాల్లో కన్పించే అనుష్కకీ చాలా తేడా ఉంటుంది. మరి 'భాగమతి'లో అనుష్క ఎలా ఉంటుంది? తెలియాలంటే సినిమా రిలీజ్‌ అవ్వాలి కదా! ఈ లోగా కన్‌ఫ్యూజన్‌తో స్వీటీ బాగా ఇబ్బంది పెట్టేస్తూనే ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS