'భాగమతి' సినిమాలో నటిస్తోంది అనుష్క. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. అనుష్క టీజర్‌లో క్లియర్‌గా కనిపించకపోయినా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చాలా స్లిమ్‌గా కనిపించింది. అంటే అనుష్క బాగా సన్నబడినట్లే లెక్క. ఎంతగా అనుష్క సన్నబడిందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
20 కేజీల దాకా అనుష్క వెయిట్ తగ్గిందట. అనుష్క డెడికేషన్‌కి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ షాకయ్యిందట. చెప్పిన టైంకి పర్‌ఫెక్ట్ వెయిట్‌తో స్లిమ్ అయ్యి సినిమా షూటింగ్‌కి రెడీ అయ్యిందట. త్వరలో అనుష్క సర్‌ప్రైజింగ్ ఎంట్రీ ఇవ్వబోతోంది సినిమా ప్రమోషన్స్ కోసం. 'భాగమతి' సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం పక్కన పెడితే, సన్నబడిన అనుష్క ఎలా ఉందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. 'బాహుబలి' సినిమాలో స్లిమ్‌గానే కనిపించినా, 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించింది. ఆ పాత్రలో లావుగానే కనిపించింది. అయితే ఆ క్యారెక్టర్‌కి ఆమె ఫిజిక్ అలా సరిపోయింది.
'సైజ్‌జీరో' సినిమా కోసం లావెక్కిన అనుష్క, ఆ తర్వాత సన్నబడడానికి చాలా సమస్యలు ఎదుర్కొంది. అమెరికా వెళ్లి లైపోసెక్షన్ చేయించుకుని అనుష్క స్లిమ్ అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి ఈ మధ్య. అయితే అవేం కాదనీ యోగా సాధన, రెగ్యులర్ వర్కవుట్స్‌తోనే అనుష్క సన్నబడిందనీ సమాచారమ్. మొత్తానికి ఇప్పుడు లావెక్కడం వల్ల వచ్చిన సమస్యలన్నింటినీ ఎదుర్కొని సన్నబడి స్లిమ్‌గా తయారై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.