నిన్ననే డార్లింగ్ ప్రభాస్ తన 37వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నిన్నటి రోజు మొత్తం ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తో ముంచెత్తారు.
ఇదిలావుండగా నిన్న ప్రభాస్ కి హీరోయిన్ అనుష్క ఒక స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిందంటూ ఫిలిం నగర్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ గిఫ్ట్ కూడా ఒక డిజైనర్ వాచ్ అని కూడా ప్రచారం నడుస్తున్నది. ఈ వార్త పై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది.
మొన్నీమధ్యన కూడా వీరిరువురు పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తాలు రావడం వాటిని ఆ ఇరువురి సన్నిహిత వర్గాలు ఖండించడం జరిగిపోయింది.
మొత్తానికి ఈ గిఫ్ట్ టాపిక్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నది.