మెర్సల్ చిత్రం ఏ ముహూర్తాన విడుదల అయిందో కాని ఒక పెద్ద వివాదాల తుట్టెని కదిపినట్టయింది.
బీజేపీ పార్టీ మెర్సల్ చిత్రంలో GST పైన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ మొదలైన వివాదం పలురకాలుగా మలుపులు తిరుగుతూ ప్రస్తుతం తమిళ హీరో విశాల్ ఇంటిపైన GST అధికారులు తనిఖీలు చేస్తుండడం వరకు వెళ్ళింది. అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలోని విశాల్ ఆఫీస్, ఇల్లుల పైన ఒకే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే హీరో విశాల్ 24 గంటల క్రితం విజయ్ మెర్సల్ చిత్రాన్ని సమర్దించడం అలాగే ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయకుల పైన విమర్శలు చేయడం గమనార్హం.
మొత్తానికి ఈ GST వివాదం ముదిరినట్టే కనిపిస్తున్నది.