కరోనా నేపథ్యంలో అస్యం అయిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు ఓటీటీలో వచ్చేసింది. తదుపరి అనుష్క నటించబోయే సినిమా ఏంటి.? అన్న చర్చ షురూ అయ్యింది. అనుష్క ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతోందన్నది తాజా ఖబర్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో అనుష్కతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనీ, అయితే.. కమర్షియల్ అంశాలు సినిమాలో మెండుగా వుంటాయనీ తెలుస్తోంది. ‘భాగమతి’ తరహాలో ద్రి¸ల్లింగ్ కంటెంట్ వుంటూనే, కమర్షియల్ అంశాలకు అవకాశం ఎక్కువగా వుండేలా కథ ఇప్పటికే సిద్ధమైందని సమాచారం.
ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం. ‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’ సినిమాలో మెరిసిన అనుష్క, తాజాగా ‘నిశ్శబ్దం’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా సినిమాకీ తనదైన ప్రత్యేకతను చూపిస్తూ, వెరైటీ కథాంశాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. ‘నిశ్శబ్దం’ విషయంలో జరిగిన జాప్యం ఇకపై జరగకూడదనే ఆలోచనతో వుందట అనుష్క. వచ్చే సమ్మర్ నాటికే అనుష్క కొత్త సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోవచ్చని సమాచారం. అన్నీ కుదిరితే, ఈ నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం వుందని అంటున్నారు.