అనుష్కకి ఇంకో పేరుంది. అదే స్వీటీ. ఆ పేరులానే ఆమె చాలా 'స్వీటీ'. హీరోయిన్లందరికీలోకి అనుష్క చాలా చాలా స్పెషల్. సినిమాలకీ, రియల్ లైఫ్‌కీ చాలా తేడా చూపిస్తుంటుందామె. గ్లామరస్ సినిమాలు చేసినా, సినిమా ఫంక్షన్లలో అనుష్క ప్రదర్శించే డిగ్నిటీ, సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
ఆ సంగతి అలా ఉంచితే 'అరుంధతి' తర్వాత అంతకు మించిన సోలో హిట్ అనుష్కకి 'భాగమతి' సినిమాతో దక్కింది. వసూళ్ళ ప్రభంజనం సృష్టించేస్తోంది అనుష్క 'భాగమతి' సినిమాతో. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రికార్డు స్థాయి వసూళ్ళతో 'భాగమతి' దూసుకుపోతోంది. ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్‌ని నిరాశపర్చినా, జనవరి చివర్లో వచ్చిన 'భాగమతి'తో అనుష్క, టాలీవుడ్ బాక్సాఫీస్‌కి కొత్త గ్లామర్ తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. ఇలాంటి సినిమాలకి అనుష్క తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం. 'రుద్రమదేవి' కావొచ్చు, 'అరుంధతి' కావొచ్చు అనుష్క మాత్రమే న్యాయం చేయదగ్గ పాత్రలవి. ఆ కోవలోకే 'భాగమతి' కూడా వచ్చి చేరిందిప్పుడు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓ వైపు చేస్తూనే, ఇంకో వైపు గ్లామరస్‌గా పలు సినిమాల్లో కన్పిస్తూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్ సంపాదించుకోవడం అతి కొద్దిమందికే చెల్లుతుంది. ఆ లిస్ట్‌లో అనుష్కకి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ దక్కుతుందని చెప్పేయొచ్చు. 'భాగమతి' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మళ్ళీ ఇలాంటి సినిమా అనుష్క నుంచి ఎప్పుడొస్తుంది? అంటే, కొన్ని సినిమాలు అద్భుతాల్లాంటివి, అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అలాంటి పాత్రలు ఎప్పుడొచ్చినా చేయడానికి తాను సిద్ధమని అనుష్క సమాధానమిచ్చింది.