మీడియాలో గత నాలుగైదు రోజుల నుండి అనుష్క-విరాట్ ల పెళ్ళికి సంబందించిన వార్తలు రావడం వారు ఇటలీ లోని ఒక ప్రదేశంలో వివాహం చేసుకోనున్నారు అన్న వార్తల నడుమ ఏం జరుగుతుందో? అసలు నిజంగా పెళ్ళి చేసుకుంటున్నారా? లేక కేవలం నిశ్చితార్ధమేనా? అన్న అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి.
వీటన్నిటికి విరాట్ కోహ్లి తనదైన స్ట్రెయిట్ డ్రైవ్ రూపం లో ఏకంగా పెళ్ళి చేసుకున్న ఫోటోలని తన సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పేశాడు. ఇక అనుష్క శర్మ కూడా అదే పని చేసింది. దీనితో ఏమి జరుగుతుంది? ఏమి జరగబోతుంది అన్న అభిమానుల నిరీక్షణ నేపధ్యంలో ఇలా వీరిద్దరి కథ సుఖాంతం అవ్వడం నిజంగా అందరికి సంతోషాన్ని మిగిల్చింది.
వీరి వివాహం నిన్న ఇటలీలోని టస్కనీ రిసార్ట్ లో కుటుంబసభ్యుల నడుమ ఈ వివాహం జరిగింది. వీరి వివాహ వేడుకకి ప్రముఖ డిజైనర్ సబ్యసాచి దుస్తులు డిజైన్ చేసింది. ఇక రిసెప్షన్ వేడుకలు వీరు ఇండియా తిరిగి వచ్చాక జరుగుతాయి అని తెలుస్తుంది. ఇక వీరి పెళ్ళి ప్రకటన తరువాత యావత్ సోషల్ మీడియా అలాగే న్యూస్ ఛానల్లో ఇదే వార్త ప్రసారమయింది.
ఇక కొన్ని ఛానల్స్ తాము చెప్పిందే జరిగిందంటూ తమని తాము మెచ్చుకోవడం ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు.