తలైవర్ రజినీకాంత్ నేడు తన 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కాలా చిత్రానికి సంబందించిన సెకండ్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రవేశం గురించిన ప్రకటన ఉండబోతోందో అన్న ఊహాగానాల పైన నీళ్ళు చల్లేశాడు అనే చెప్పాలి.
ఈ మధ్యనే తాను వెంటనే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో ఒకింత ఆయన అభిమానులు నిరుత్సాహం చెందారు.
మొత్తానికి రజినీకాంత్ ఈ సంవత్సరం కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ గానే కొనసాగనున్నాడు అన్నది సుస్పష్టం.