ఈ మధ్యనే ఇటలీ దేశంలో ఒకటైన ప్రేమ జంట (అనుష్క-విరాట్), నిన్న దేశ రాజధానిలో వివాహ విందుని ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ప్రముఖ సెలబ్రిటీలు అందరు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇక ఈ వేడుకకి అనుష్క ధరించిన నెక్లెస్ పైనే చర్చ నడుస్తున్నది. ఈ వేడుకలో ఆమె ధరించిన నెక్లెస్ మొత్తం ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ నెక్లెస్ ధర ఎంత ఉండొచ్చు అన్న అంశం పైన రకరకాల లెక్కలు బయటకి వస్తున్నాయి.
అయితే ఈ లెక్కలు ఏమి కరెక్ట్ కావు అని అనుష్క సన్నిహిత వర్గాలు తెలియచేశాయి. మరి ఈ చోకర్ నెక్లస్ విలువ సుమారు రూ 30 నుండి 40 లక్షలు ఉంటుంది అని తెలిసింది. ఇక ఇప్పటికే వీరి పెళ్ళికే సుమారు రూ 2 కోట్ల ఖర్చు అయింది అనే అంచనాల నడుమ ఈ వివాహ రిసెప్షన్ ఖర్చు చూస్తే, ఈ జంట అత్యంత ఖరీదైన వివాహం చేసుకున్న జంటల జాబితాలోకి వెళ్ళే అవకాశం ఉంది అన్నది నిజం.
డిసెంబర్ 26న ముంబైలో క్రికెటర్లకి ప్రత్యేకంగా వివాహ విందు ఇవనున్నారు ఈ జంట.