'బిగ్‌బాస్' రియాల్టీ షోలో అనసూయ కనిపించవచ్చునని ఈ షో ప్రారంభానికి ముందే గాసిప్స్ వినవచ్చాయి. స్వయంగా ఎన్టీయార్ రిక్వెస్ట్ చేయడంతోనే అనసూయ అంగీకరించిందనే గాసిప్స్ రాగా, అది ఉత్తదేనని తేలిపోయింది. అయితే ఆ గాసిప్స్ ఇప్పటికీ అనసూయని వదలడంలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ హౌస్‌లోకి అనసూయ ఎంట్రీ ఇవ్వబోతోందని లేటెస్ట్ గాసిప్స్ షురూ అయ్యాయి. ఈ గాసిప్స్‌ని అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఖండించింది. అంత తీరిక లేదనీ, తన ప్రాజెక్టులతో తాను బిజీగా ఉన్నానని పేర్కొంది అనసూయ. దాంతో సోషల్ మీడియాలో అనసూయని 'ట్రాల్' చేయడం మొదలు పెట్టారు. అనవసరంగా ఆమెను వివాదాల్లోకి లాగుతున్నారు. బుల్లితెరపై అనసూయ బిజీయెస్ట్ యాంకర్. అంతే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది. 70 రోజులు బిగ్‌హౌస్‌లో ఉండిపోవడమంటే అంత బిజీ స్టార్‌కి కుదిరేపని కాదు. అది అర్థం చేసుకోవడం మానేసి, అనసూయని వివాదాల్లోకి లాగుతారెందుకు? ఆమె ఆవేదన కూడా ఇదే. ఇంతవరకూ బిగ్ హౌస్‌కి స్టార్ వేల్యూ లేదనే ఫీలింగ్ ఆడియన్స్‌లో కలుగుతోంది. ఆ రకంగా ఇప్పుడున్న సెలబ్రిటీస్‌లో కొంత మందిని తొలగించి, వారి ప్లేస్‌లో అనసూయ, మంచు లక్ష్మీ వంటి స్టార్స్‌ని జాయిన్ చేస్తే ఆ షోకి మరింత గ్లామర్ వస్తుందని ఆడియన్స్ అభిప్రాయం. ఏమో ఆడియన్స్ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ షో సెలబ్రిటీస్ ఛేంజ్ చేయడంలో, 'బిగ్‌బాస్' టీమ్ ఒక ఆలోచన చేస్తుందేమో చూడాలి.