రెహ‌మాన్ దృష్టిలో ప‌డిన ప‌ల్లెటూరి కోయిల‌

మరిన్ని వార్తలు

రెహ‌మాన్
 
టాలెంట్‌కి వ‌య‌సుతో సంబంధం లేదు. ప్రాంతంతో అవ‌స‌రం లేదు. ఒక్క‌సారి వెలుగులోకి తీసుకొస్తే.. అదే ప్ర‌పంచానికి పరిచ‌యం చేసేస్తుంది. ఈమ‌ధ్య సోష‌ల్ మీడియా చ‌ల‌వ‌తో వెలుగులోకి వ‌చ్చిన స‌రికొత్త గాయ‌నీమ‌ణి బేబీ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ బేబీ గురించి ఎవ్వ‌రికీ తెలీదు.  సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒకే ఒక్క వీడియో ఆమెని పాపుల‌ర్ చేసేసింది. ఈ గాయ‌నీమ‌ణితో ఓ పాట పాడించుకోవాల‌ని సంగీత ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. అందులో భాగంగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె ఈరోజు బేబీతో ఓ పాట పాడించారు. 
 
గాయ‌నిగా బేబీ ప్ర‌స్థానానికి ఇది ఆరంభం మాత్ర‌మే. అలా పాట పాడిందో లేదో.. ఇలా ఆస్కార్ అవార్డు గ్ర‌హీత రెహ‌మాన్ దృష్టిలో ప‌డిపోయింది. సోష‌ల్ మీడియా ద్వారా బేబీ గురించి తెలుసుకున్న రెహ‌మాన్‌.. ఇప్పుడు బేబీతో ఓ పాట పాడించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార్ట‌. బేబీని చెన్నై తీసుకురావాల‌ని సంగీత ద‌ర్శ‌కుడు కోటికి ఆయ‌న స‌మాచారం అందించార‌ని తెలుస్తోంది. అన్న‌ట్టు.. ఈ గాన కోయిల మోగాస్టార్ దృష్టిలోనూ ప‌డింది. చిరు స‌తీమ‌ణి సురేఖ ద్వారా  బేబీ గురించి తెలుసుకున్న చిరు.. బేబీని ఇంటికి పిలిపించుకుని, ఆమె పాట‌లు విని, స‌త్క‌రించి మ‌రీ పంపారు. ఇలా అన‌తి కాలంలోనే ఓ గాయ‌ని సెల‌బ్రెటీగా మారిపోయింది. ఇదంతా సోష‌ల్ మీడియా చ‌ల‌వే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS