ప్రస్తుతం దువ్వాడ జగన్నాథమ్ సినిమాతోబిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా అనే పేరు ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంగీత దర్శకుడ్నీ ఎంపిక చేసుకొన్నట్టు టాక్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ సినిమాకి రెహమాన్ సంగీతం అందించడం ఇదే తొలిసారి. కొమరం పులి తరవాత నేరుగా ఓ తెలుగు సినిమాకి రెహమాన్ పనిచేయలేదు. రెహమాన్ సంగీత దర్శకుడైతే... ఈ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సినిమా విశేషాలు మరిన్ని తెలిసే అవకాశాలున్నాయి.