ఏ సినిమాకైనా ఇప్పుడు ఓవర్సీస్ వసూళ్లు కీలమయ్యాయి. చిన్న సినిమాలు సైతం ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేస్తున్నాయి. నాని, శర్వానంద్, నిఖిల్ చిత్రాలు కూడా వన్ మిలియన్ డాలర్లను అవలీలగా అందుకొంటున్నాయి. అలాంటప్పుడు స్టార్ దర్శకుడి సినిమాకి అక్కడ ఎన్ని వసూళ్లు రావాలి?? కలక్షన్లు ఏ స్థాయిలో ఉండాలి? కానీ పూరి జగన్నాథ్ సినిమా `రోగ్` మాత్రం ఓవర్సీస్‌లో చతికిల పడింది. ఈ సినిమాని పట్టించుకొనే నాథుడే కరవయ్యాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి 400 డాలర్లు కూడా రాలేదట. ఈమధ్య కాలంలో ఈ సినిమానే అతి తక్కువ వసూళ్లు చేజిక్కించుకొందని, ఓ స్టార్ దర్శకుడి సినిమాకి ఇంత తక్కువ స్థాయిలో వసూళ్లు రావడం ఆశ్చర్యపరుస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. నిషాన్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రమిది. అతనిపై ఎవ్వరికీ ఎలాంటి నమ్మకాలూ, అంచనాలు లేవు. అయితే పూరిని చూసైనా టికెట్లు తెగాలిగా. అదీ లేదు. ఓ స్టార్ డైరెక్టర్ సినిమాకి ఇంతకంటే అవమానం ఉంటుందా..? మొత్తానికి ఓవర్సీస్‌లో నమోదైన అతి పెద్ద డిజాస్టర్లలో `రోగ్` ఒకటిగా మిగిలిపోయింది.