సూపర్‌స్టార్‌ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆరే.!

By iQlikMovies - October 11, 2018 - 10:54 AM IST

మరిన్ని వార్తలు

సినిమా అభిమానం ఎలా ఉంటుందో సినీ అభిమానులకే తెలుసు. తాము అభిమానించే హీరోలకు గుడి కట్టేసిన అభిమానులున్నారు. రక్తదానం చేయడంలో, నేత్రదానం చేయడంలో, ఇతరత్రా సేవా కార్యక్రమాల్లో అభిమానుల పాత్ర చాలా చాలా గొప్పది. అందుకే ఏ హీరో అయినా తమ అభిమానుల్ని చూసి గర్వంగా ఫీలవుతాడు. వారికి రోల్‌ మోడల్స్‌గా ఉండాలని, మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. అసలు విషయానికి వస్తే, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు 'అరవింద సమేత..' 

 

మేనియాలో ఊగిపోతున్నారు. వారి అభిమానానికి ముచ్చట పడ్డ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ తమ ఉద్యోగులకు ఈ రోజు సెలవు దినం ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' సినిమా కోసం ఇలాగే జరిగింది. ఆ తర్వాత ఆ ఘనత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి దక్కింది. ఇంతకీ 'అరవింద సమేత..' కోసం తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఉందనుకుంటే పొరపాటే.

 

ఇది బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు కావడంతో వారి ఆనందం కోసం వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు ఆ సంస్థ పేర్కొంది. సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రే సినిమా రిలీజ్‌ కోసం ధియేటర్స్‌ వద్ద జన సంద్రాన్ని తలపించేలా అభిమానులు సందడి చేశారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS