'అరవింద..' పాటల పండగ లేదట.!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'అరవింద సమేత..' చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దసరాకి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా విడుదలైన 'అనగనగా..' ఆడియో సింగిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

అయితే 'అరవింద సమేత..' ఆడియోని ఈ నెల 20న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్‌ తాజాగా వెల్లడించింది. అయితే త్వరలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేయనున్నారనీ తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రాయలసీమ కుర్రోడి పాత్రలో అచ్చమైన రాయలసీమ యాసలో డైలాగులు పలకనున్నాడు. ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా త్రివిక్రమ్‌ రాసిన డైలాగులు చిత్రానికి హైలైట్‌ కానున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. టీజర్‌లో ఆల్రెడీ రాయలసీమ ఫ్యాక్షన్‌ విశ్వరూపాన్ని చూచాయగా చూపించేశారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎన్టీఆర్‌ చేతిలో కత్తి పట్టుకుని చురకత్తుల్లాంటి చూపులతో వస్తున్న ఆ టీజర్‌కి అభిమానులు ఊగిపోతున్నారు. 

'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్‌ నుండి వస్తున్న చిత్రం ఇది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్దే, తారక్‌తో జత కడుతోంది ఈ చిత్రంలో. జగపతిబాబు, సునీల్‌, ఈషారెబ్బ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS