మరికొద్ది గంటల్లో 'అరవింద సమేత వీరా రాఘవ' బొమ్మ పడిపోబోతోంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందా??  అని ఎన్టీఆర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా 'అరవింద' తొలి రివ్యూ వచ్చేసింది. 
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు 'అరవింద'కు రివ్యూ ఇచ్చేశాడు. ఏకంగా 4 స్టార్లిచ్చి ఈసినిమా సూపర్ హిట్ అని ఖాయం చేసేశాడు. ఉమర్ సంధు ప్రముఖ బాలవుడ్ సినీ విశ్లేషకుడు. ప్రతీ సినిమా విడుదలకు ముందు.. టాక్ తెలసుకుని, సెన్సార్ రిపోర్టుల్ని బట్టి..  ఆ సినిమా జాతకాన్ని అంచనావేస్తుంటాడు.  ఉమర్ రివ్యూలంటే అభిమానులకు గురి. అందుకే వాళ్లంతా ఉమర్ ఏం చెబుతాడా?  అని చూస్తుంటారు. 
ఇప్పుడు 'అరవింద అదిరింది అనేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని, కథ మాస్‌కి నచ్చుతుందని, ప్రతీ పాత్రనీ బలంగా తీర్చిదిద్దారని, సంగీతం కూడా బాగుందని ఇలా 'అరవింద'కు కితాబులు ఇచ్చుకుంటూ వెళ్లాడు.
ఈ రివ్యూ కచ్చితంగా అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తేదే. కాకపోతే 'అజ్ఞాతవాసి'కి ఈయన ఇదే తరహాలో రెచ్చిపోయాడు. కానీ ఆ సినిమా దారుణంగా పల్టీకొట్టింది. మరి 'అరవింద' జాతకం ఏమవుతుందో??

 
 
 
 
 
 
 
 
 
					                
                                

