క్యారెక్టర్ ఆర్టిస్టుగా 'బన్నీ' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్‌కుమార్ తనయ వరలక్ష్మి తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలకు, ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది.
తాజాగా ఈమె 'పందెంకోడి 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ. హీరోకు సమానమైన పాత్ర అది. హీరోకి ధీటైన విలన్ పాత్రలో వరలక్ష్మి కనిపించబోతోంది. ఈ మధ్య విడుదలైన ట్రైలర్‌లో వరలక్ష్మి అప్పియరెన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంగతిటుంచితే, ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌ని టార్గెట్ చేసింది. ఇంతవరకూ తెలుగులో వరలక్ష్మి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ 'పందెం కోడి 2' చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేస్తోంది.
అందులో భాగంగానే తొలిసారి ఈ సినిమా కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటోంది. అలాగే వరలక్ష్మి నటిస్తున్న 'సర్కార్' చిత్రానికి కూడా వరలక్ష్మి తెలుగు డబ్బింగ్ చెప్పిందట. ఈ రెండు చిత్రాలతో తెలుగులో కూడా తన ఉనికిని చాటుకోవాలనే యోచనలో వరలక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తెలుగు దర్శక, నిర్మాతలు కూడా వరలక్ష్మి కోసం కొన్ని విలన్ పాత్రలకు ఆల్రెడీ స్క్రిప్టులు ప్రిపేర్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్.