మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల షూటింగులూ ఆగిపోయాయి. సర్కారు వారి పాట అయితే ముందే ఆగింది. ఆమధ్య దుబాయ్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. సినిమాలో అన్ని పాత్రలకూ నటీనటులు ఫిక్సయిపోయారు. ఒక్క ప్రతినాయకుడి పాత్రకు తప్ప. అరవింద్ స్వామి, అనిల్ కపూర్, మాధవన్... ఇలా చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి అర్జున్ ని విలన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. మహేష్ సినిమాలో అర్జున్ నటించడం ఇదే తొలిసారి.
అయితే అర్జున్ ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. `లై`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` లాంటి సినిమాల్లో అర్జున్ కీలక పాత్రలు పోషించాడు. అయితే ఆరెండు సినిమాలూ ఫట్ మన్నాయి. మరి ఆ సెంటిమెంట్ ని కూడా ఎదురొడ్డి... విలన్ గా అర్జున్ ని ఎంచుకున్నారంటే విశేషమే. మే 31.. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ.. అలాంటిదేం రాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. ఇలాంటి అప్ డేట్ ఇచ్చినా... హ్యాపీ ఫీలవుతారేమో..?