మలైకా అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ ఓపెన్ సీక్రెట్. మలైక.. 2017లో అర్బజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుంది. విడాకులలకు ముందే అరోరా, అర్జున్ ల మధ్య స్నేహం మొదలైయిందని చెబుతుంటారు. ఏదేమైనా.. ఇప్పుడు ఇద్దరూ కలిసే వుంటున్నారు. అయితే తాజాగా మలైకా అరోరా తల్లి కానుందంటూ ఓ కథనం వచ్చింది.
దీనిపై అర్జున్ కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇలాంటి పనికిరాని వార్తల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు తెలుసా? ఇలాంటి రూమర్స్ ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే తరచూ ఇటువంటి వార్తలనే ర్తాస్తున్నారు. అవి కాస్త సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యి అందరూ వాటిని నిజాలే అని నమ్ముతున్నారు. ఇకనైనా ఇలాంటివి చేయడం మానండి.'' అని వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ కపూర్.