ఈమధ్య డబ్బింగ్ చిత్రాలు మళ్లీ హావా చూపించడం మొదలెట్టాయి. కేజీఎఫ్,కాంతారా, సర్దార్.. ఇలా డబ్బింగులకు మంచి విజయాలు అందుతున్నాయి. మొన్నటి వారం కూడా.. డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది. అదే.. `లవ్ టుడే`. ఏమాత్రం ప్రమోషన్లు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా.. స్ట్రయిట్ సినిమా (ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం) కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఆ రకంగా డబ్బింగ్ సినిమా హవా కొనసాగినట్టైంది. ఈ వారం మరో డబ్బింగ్ సినిమా వస్తోంది.. అదే మట్టి.. కుస్తీ.
విష్ణు విశాల్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. దీనికి రవితేజ నిర్మాత. ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగు స్ట్రయిట్ సినిమా హిట్ 2 వస్తోంది. దీనికీ మంచి ప్రమోషన్లు కనిపిస్తున్నాయి. హిట్ 2 థ్రిల్లర్ అయితే... మట్టి - కుస్తీ... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ రెండింటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే.. ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలంటే మరో రోజు ఆగాలి.