బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పైన అనూహ్యంగా ఒక దాడి జరిగింది.
సందీప్ అవుర్ పింకీ ఫరార్ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్ లో జరుగుతున్న సమయంలో మద్యం తాగి వచ్చిన ఒక వ్యక్తి సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదట. ఏకంగా సదరు వ్యక్తి అర్జున్ కపూర్ ని కలవడం ఒక ఫోటో దిగుదామని కోరగా, వచ్చిన వ్యక్తి మధ్య సేవించి ఉండడంతో వెంటనే అతన్ని వారించబోయాడు.
దీనితో ఇద్దరు మధ్య ఘర్షణకి దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగినట్టు యూనిట్ వర్గాల సమాచారం. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకి అప్పగించినట్టు సమాచారం.
అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో యూనిట్ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తానికి ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.