యాక్షన్‌ కింగ్‌ ఆర్జున్‌ చేతికి ఏమైంది?

By iQlikMovies - June 28, 2018 - 11:51 AM IST

మరిన్ని వార్తలు

ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌. కొన్ని సందర్భాల్లో ఆయనకు ఓ చేయి సడెన్‌గా పని చేయకుండా పోతుంది. ఇదో అరుదైన వ్యాధి. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌కి ఇలాంటి అరుదైన వ్యాధి వస్తే ఏంటి పరిస్థితి.? ఈ వ్యాధి కారణంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఆ పోలీసాఫీసర్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'కురుక్షేత్రం'. 

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. నేచురల్‌ స్టార్‌ నాని ఈ ట్రైలర్‌ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. అర్జున్‌ తన ఫ్యావరేట్‌ హీరో అనీ, తన ఫ్యావరేట్‌ హీరో సినిమా ట్రైలర్‌ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందనీ ఈ సందర్భంగా నాని అన్నాడు. 

ఇకపోతే సినిమా విషయానికి వస్తే, ఇలాంటి కాన్సెప్ట్‌లు ఒకింత రిస్క్‌ అయినా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. గతంలో తమిళ హీరో విశాల్‌ 'ఇంద్రుడు' సినిమాలో ఓ అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నటించాడు. భయం, కోపం వంటి ఫీలింగ్స్‌ కలిగినప్పుడు సడెన్‌గా నిద్రలోకి జారుకునే వ్యాధి అది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆ సినిమాని తెరకెక్కించారు. అలా ఇప్పుడు అర్జున్‌ నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంట్రెస్ట్‌ని కలిగిస్తుందో చూడాలి మరి. 

ఈ మధ్య అర్జున్‌ తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అయితే దురదృష్టవశాత్తూ అర్జున్‌ నటించిన సినిమాలు ఆశించిన విజయాల్ని అందుకోలేదు. తద్వారా అర్జున్‌ పాత్రలకు అంతగా ఆదరణ దక్కకుండా పోయింది. హీరోగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో అర్జున్‌ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS