నితిన్-మేఘా ఆకాష్ జంటగా రూపొందిన చిత్రం లై ఇంకొక నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబందించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఇక ఈ ‘లై’ చిత్రానికి సంబందించిన కథలో కథానాయకుడి పాత్ర కన్నా ప్రతినాయకుడి పాత్రకే ప్రాధాన్యం ఉంటుంది అని ఒక రకంగా చెప్పాలంటే విలన్ పాత్ర నుండే ఈ కథ మొదలవుతుంది అని దర్శకుడు హను చాలా సార్లు చెప్పాడు.
ఈ తరుణంలో మొన్న జరిగిన ఈవెంట్ కి లై చిత్రంలో ప్రతినాయకుడు అయిన అర్జున్ రాకపోవడం అలాగే ఆయన పాత్ర గురించి గాని ఆయన గురించి గాని ఎవరు మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
మొదట అందరికి చెప్పినట్టుగానే సినిమా తీశారా లేక మార్పులు ఏమైనా చేసి తీశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.