జయ జానకి నాయక చిత్రానికి సంబందించిన విడుదల తేదీలలో మార్పు జరిగే ఆస్కారం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, జయ జానకి నాయక చిత్రం ముందుగ అనుకున్న ఆగష్టు 11వ తేదీన కాకుండా ఒకరోజు ముందుగా అంటే ఆగష్టు 10న విడుదల అవ్వనుంది అని తెలుస్తుంది.
దీనికి కారణం- ఒకే రోజు మూడు చిత్రాలు (జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి & లై) విడుదల అయితే ఓపెనింగ్స్ విషయంలో అంతా ఇబ్బందులకి గురవుతారు అనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
అయితే ఈ విషయానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.