అర్జున్ రెడ్డి... ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడని సగటు సినిమా అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా ఇటు ప్రేక్షకులని ఎంత థ్రిల్ చేస్తున్నాడో అదే విధంగా బాక్స్ ఆఫీస్ ని కూడా అలానే షేక్ చేస్తున్నది.
దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ధియేట్రికల్ రైట్స్ ని దక్కించుకోగా, రూ4 కోట్ల వసూళ్ళ తరువాత వచ్చే లాభాల్లో నిర్మాత, ఏషియన్ సినిమాస్ వారు 50-50 శాతం పంచుకోనున్నారు.
ఇక ఇదిలావుండగా అర్జున్ రెడ్డి శాటిలైట్ రైట్స్ రూపంలో సుమారు రూ4.5 కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అలాగే నిర్మాతలే స్వయంగా ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయగా, ఈ సినిమాతో నిర్మాతలకి లాభాల పంట పండనుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి అర్జున్ రెడ్డి తెలుగు సినిమా రూల్స్ నే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసెలా కనిపిస్తున్నది.