ఈగ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ స్టార్ హీరో సుదీప్. తన భార్య ప్రియా రాధాకృష్ణన్ తో, 14 ఏళ్ళ వివాహ బంధం తరువాత విడాకులు కోరుతూ 2015 లో కోర్టులో ఫిటీషన్ వేసాడు. అయితే ఆ తరువాత ఇద్దరూ మనసు మార్చుకున్నారు. కుటుంబ కలహాలతో కోర్టు మెట్లెక్కిన సుదీప్, ప్రియ లు తమ కూతురు శాన్వి కోసం, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు కోర్టు కి వెల్లడించారు.
ఈ దంపతుల లాయర్ మీడియాతో మాట్లాడుతూ, సుదీప్, ప్రియ లు తమ వైవాహిక బంధం కొనసాగించాలనుకున్నట్లు మీడియాకి చెప్పారు. కోర్టులో కేసు వేసినప్పటి నుంచి సుధీర్ ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాలేదని, తన భార్య ప్రియ కి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చేనందుకు కూడా సిద్దపడ్డాడని తెలిపారు.
అయితే తన కూతురు శాన్వి కోసం మనసు మార్చుకున్నాడని వివరించాడు. ఇద్దరి మధ్యా జరిగిన మనస్పర్థలు పక్కన పెట్టి, తాము కలిసే ఉంటామని రాత పూర్వకంగా కోర్టు కి తెలపగా, కోర్టు వారి నిర్ణయాన్ని అంగీకరించి, మరో అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది.
2001 లో నటుడు సుదీప్, ప్రియ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి శాన్వి అనే కూతురు వుంది. అయితే కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా వీరు 2015 లో బెంగుళూరు ఫ్యామిలీ కోర్టు ని ఆశ్రయించారు. అయితే కూతురు శాన్వి కోసం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో, సుదీప్ అభిమానులతో పాటు, ప్రియ కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేసారు.