విజయ్ దేవరకొండ - షాలిని, హీరో హీరోయిన్లగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. విడుదలకు ముందే ఈ సినిమా చాలా కాంట్రవర్సీటీ లు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ ఓ సంచలనంగా మారాయి. ఈ సినిమా పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హెచ్ చించేయటం, తర్వాత వర్మ చేసిన కామెంట్స్, దీనికి ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ లో హీరో చేసిన కాంట్రవర్సీ ప్రసంగం, ఇలా చెప్పుకుంటూ పొతే ఈ సినిమాకి కావలసినంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.
ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ముందురోజు గురువారం అటు ఓవర్సీస్ లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ప్రీమియర్ షోస్ వేయటం జరిగింది. ప్రీమియర్ షోస్ తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, యూత్ ని మెప్పించే విధంగా ఉందంటూ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి మంచి రివ్యూస్ తో పాటు, రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి.
ఈ సినిమాకి అమెరికాలో ప్రీమియర్ షోస్ ద్వారా లక్షా 94 వేల 51 డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం ఒక కోటి 24 లక్షలు వచ్చాయని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతే కాకుండా ఈ సినిమా అమెరికాలో మంచి వసూళ్లు రాబడుతుందని, ప్రీమియర్ కే ఈ రేంజ్ కలెక్షన్స్ ఉంటే మొదటి వారం కలెక్షన్స్ అదిరిపోతాయని చెప్పాడు.
ఇక ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపంలో 4 నుండి 5 కోట్ల మధ్యలో ప్రముఖ ఛానల్ నుండి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి కి మరో యంగ్ హీరో శర్వా నంద్ తో నెక్స్ట్ సినిమా చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.