అర్జున్ సుర‌వ‌రం ఫైన‌ల్ రిపోర్ట్

By iQlikMovies - December 14, 2019 - 10:59 AM IST

మరిన్ని వార్తలు

 ఎన్నో వాయిదాలు ప‌డి, పేరు మార్చుకుని విడుద‌లైన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. విడుద‌ల‌కు ముందు ఈ సినిమాపై ఎలాంటి బ‌జ్ లేదు. కానీ.. సినిమా విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. పోటీ గా మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో మంచి వ‌సూళ్లు ద‌క్కించుకుంది. ఇప్పటి వ‌ర‌కూ ఈ సినిమాకి 9.51 కోట్ల షేర్ వ‌చ్చింది. నిఖిల్ కెరీర్‌లో ఇదే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రం.

 

నైజాంలో ఈ సినిమాకి 3.6 కోట్లు వ‌చ్చాయి. సీడెడ్‌లో 90 ల‌క్ష‌లు, ఈస్ట్‌, వెస్ట్ క‌లిసి కోటి రూపాయ‌లు తెచ్చుకుంది. 6 కోట్ల‌కు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంటే మిగిలిన 3.5 కోట్లూ బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే అన్న‌మాట‌. శాటిలైట్ రూపంలోనూ ఈసినిమాకి బాగానే గిట్టుబాటు అయ్యింది. అలా.. నిఖిల్ కెరీర్‌లో ఈ సినిమా మ‌ర్చిపోలేని చిత్రంగా మిగిలింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS