మొన్న కిచెన్‌ రొమాన్స్‌ ఇప్పుడు విదేశీ రొమాన్స్‌.. వావ్‌ క్యా సీన్‌ హై.!

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ గాళ్‌ ఫ్రెండ్‌ని దించాడండోయ్‌. అదేంటీ నిన్న వైఫ్‌ అన్నాడుగా అనుకుంటున్నారా.? వైఫ్‌ దారి వైఫ్‌దే. గాళ్‌ ఫ్రెండ్‌ దారి గాళ్‌ ఫ్రెండ్‌దే. అన్నట్లు మీరు అసలు విషయం మర్చిపోతున్నారు కాబోలు. మనోడు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అని. మరి వరల్డ్‌ వైడ్‌గా ఎంత మంది గాళ్‌ ఫ్రెండ్స్‌ని లైన్‌ పెట్టి ఉంచాడో ఎవరికి తెలుసు. పూర్తిగా తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతానికి అయితే కొంత తెలుసుకోండి.

 

ఫ్రాన్స్‌లో మనోడికి ఓ గాళ్‌ ఫ్రెండ్‌ ఉంది. ఆమెనే ఇసా బెల్లె. ఈ పాపతో సరదాగా షికారు చేస్తున్న ఫోటో లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ఇక్కడ మన హీరోగారి పేరు గౌతమ్‌ అట. వావ్‌ వాట్‌ ఏ ఛేంజ్‌ భార్య దగ్గర శీనయ్యగా డీసెంట్‌గా కనిపించిన మన హీరో ఇప్పుడు గౌతమ్‌ అంటూ స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఇంకా ఇదేం ఉంది. మరో ఇద్దరు గాళ్‌ ఫ్రెండ్స్‌ మనోడి కోసం ఎదురు చూస్తున్నారండోయ్‌. వారే రాశీఖన్నా, కేథరీన్‌. త్వరలోనే ఈ ముద్దుగుమ్మల రొమాన్స్‌ కూడా చూడబోతున్నాం. ఇప్పటికిలా నలుగురు భామల గురించి మాత్రమే మనకు ఇన్‌ఫామేషన్‌ ఉంది. ఇంకా మనోడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందిని లైన్‌లో పెట్టాడో తెలియాలంటే లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS