'అర్జున్‌ సురవరం'కి లైన్‌ క్లియర్‌ అయ్యిందా?

మరిన్ని వార్తలు

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'అర్జున్‌ సురవరం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని మరీ వాయిదా పడడం బాధాకరం. ఓ ఆంగ్ల మూవీ వచ్చి, ఓ మోస్తరు అంచనాలపై ఉన్న మన తెలుగు సినిమా రిలీజ్‌ని వాయిదా పడేలా చేయడాన్ని ఆ హీరో అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. 'అవెంజర్స్‌ - ఎండ్‌ గేమ్‌' సృష్టించిన హైప్‌తో 'అర్జున్‌ సురవరం' నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అర్ధాంతరంగా నిఖిల్‌ సినిమాని వాయిదా వేసేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ పాపం నిఖిల్‌కి రిలీజ్‌ స్లాట్‌ దొరకలేదు.

 

ఇక ఈ సినిమాని జనం మర్చిపోయారు కూడా. అయితే, తాజాగా 'అర్జున్‌ సురవరం' రిలీజ్‌ డేట్‌ గురించి నెట్టింట్లో మళ్లీ చర్చ మొదలైంది. ఆ క్రమంలోనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిఖిల్‌ని ఓ అభిమాని.. 'అన్నా నీ సినిమా విడుదల ఎప్పుడు? అని ప్రశ్నించగా, 'పెద్దన్న 'సాహో' సినిమా వచ్చాకే మన సినిమా..' అని చిన్న హింట్‌ ఇచ్చాడు. ఆగస్ట్‌ చివర్లో 'సాహో' విడుదల కానుంది.

 

అంటే సెప్టెంర్‌ కానీ, అక్టోబర్‌ కానీ, నిఖిల్‌ సినిమా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో వరుణ్‌తేజ్‌ 'వాల్మీకి' విడుదల కానుంది. తర్వాత కూడా ఒకటీ, అరా చిన్న సినిమాలున్నాయి. ఆ స్లాట్స్‌లో నిఖిల్‌ ఫిక్స్‌ అవుతాడేమో చూడాలి మరి. మళ్లీ అక్టోబర్‌లో మెగాస్టార్‌ 'సైరా' రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS