మెగా బ్ర‌ద‌ర్స్‌పై దిల్ రాజు క‌న్ను.

మరిన్ని వార్తలు

రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌... వీళ్లంద‌రితోనూ సినిమాలు తీశాడు దిల్‌రాజు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌తో మాత్ర‌మే చేయ‌లేక‌పోయాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఆమ‌ధ్య ఓ క‌థ కూడా రెడీ చేయించాడు. కానీ.. అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు చిరంజీవి మీద ఫోక‌స్ చేశాడు. తొమ్మిదేళ్ల విరామం త‌ర‌వాత‌... చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి `ఖైది నెం 150`తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు `సైరా`గా రాబోతున్నాడు. ఈ సినిమాపైనా మంచి అంచ‌నాలే ఉన్నాయి.

 

ఆ త‌ర‌వాత కొర‌టాల శివ ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించేశాడు. చిరు 153 వ సినిమా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఉండే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. `మీతో ఓ సినిమా చేయాల‌ని వుంది` అంటూ ఇటీవ‌ల దిల్ రాజు చిరుని అప్రోచ్ అయ్యాడ‌ట‌. అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం అందుతోంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ ఓ సినిమా చేయాల‌న్న ప్ర‌య‌త్నాల్ని దిల్‌రాజు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ `తొలి ప్రేమ‌` సినిమాని పంపిణీ చేసిన దిల్‌రాజు అప్ప‌ట్లో భారీ లాభాల్ని ఆర్జించారు. `గ‌బ్బ‌ర్ సింగ్‌`కీ దిల్‌రాజుకి మంచి లాభాలొచ్చాయి. అప్ప‌టి నుంచి.. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని దిల్‌రాజు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి ఈ రెండు సినిమాలూ ఎప్పుడు వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS