డైలమాలో ఆ యంగ్‌ హీరో!

By iQlikMovies - June 26, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మినిమమ్‌ గ్యారంటీ హీరోగా నిఖిల్‌కి మార్కెట్‌ బాగానే ఉంది. ఈ మధ్య నిఖిల్‌ నటించిన సినిమాలు కూడా ఓ మోస్తరు టాక్‌తో ఆయన రేంజ్‌కి హిట్‌ సినిమాలుగానే పేరు పొందాయి. అయితే, ఎందుకో ఈ మధ్య నిఖిల్‌కి కాలం కలిసి రావడం లేదు. 'కిర్రాక్‌ పార్టీ' సినిమా తర్వాత నిఖిల్‌ నుండి మరో సినిమా రాలేదు. 'అర్జున్‌ సురవరం'పై నిఖిల్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమాని ఎందుకో నిర్మాతలు ధియేటర్స్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. కారణాల మీద కారణాలు చెప్పి వెనకాడేస్తున్నారు.

 

ఆంగ్ల మూవీ 'అవెంజర్స్‌ ది ఎండ్‌ గేమ్‌' ఈ సినిమా విషయంలో నిఖిల్‌ని తాచుపాములా వెంటాడింది. ఆ సినిమా ఆగిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో నిఖిల్‌ మిన్నకుండిపోయాడు. దాంతో పాటు 'శ్వాస' అనే మరో సినిమానీ నిఖిల్‌ స్టార్ట్‌ చేశాడు. కానీ, దానికి సంబంధించిన అప్‌డేట్‌ ఏమీ లేకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు నిఖిల్‌ తన కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన 'కార్తికేయ 2'ని పట్టాలెక్కించే ఆలోచన చేశాడు. చందూ మొండేటి ఈ సినిమాని తెరకెక్కించాల్సి ఉంది.

 

అయితే, చందూ మొండేటికి అనదర్‌ కమిట్మెంట్స్‌ ఉండడంతో ఆ ప్రాజెక్ట్‌ కూడా అటకెక్కేసిందనే న్యూస్‌ వైరల్‌ అవుతోంది. మరోవైపు నిఖిల్‌ చేతిలో ఇంకొంతమంది యంగ్‌ డైరెక్టర్లున్నప్పటికీ ఆయా ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఎలాగోలా 'అర్జున్‌ సురవరం' రిలీజైతే కానీ, నిఖిల్‌ తనను వెంటాడుతున్న ఈ గడ్డు పరిస్థితి నుండి గట్టెక్కే విధానం కనిపించడం లేదు. సో ఆ సినిమా రిలీజ్‌పై ఆరా తీసే పనిలోనే ప్రస్తుతం నిఖిల్‌ తలమునకలైనట్లు తాజాగా అందుతోన్న సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS