అర్జున-ఫల్గుణ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు తదితరులు
దర్శకత్వం : తేజ మర్ని
నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీత దర్శకుడు: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
ఎడిటర్ : విప్లవ నైషదం


రేటింగ్: 2.5/5


శ్రీవిష్ణుకి కమర్షియల్ విజయాలు లేవు కానీ కధా విజయాలు వున్నాయి.  శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే మంచి కథ అయ్యింటుదని నమ్మకం. ఇటీవలే 'రాజా రాజా చోర' అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ఆయన నుంచి అర్జున-ఫల్గుణ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో జోహార్ అనే సినిమా తీసిన తేజ మార్ని ఈ సినిమా దర్శకుడు. ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. శ్రీ విష్ణు నుంచి మరో డిఫరెంట్ సినిమా అవుతుందని నమ్మకం కలిగించిన అర్జున-ఫల్గుణ ప్రయాణం ఎలా సాగింది ? ఇంతకీ ఏమిటీ అర్జున-ఫల్గుణ కథ ? 


కథ:


అర్జున్ ( శ్రీవిష్ణు)ది గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామం. పక్కా పల్లెటూరి కుర్రాడు. వుద్యోగం లేదు. పైగా ఫ్రండ్స్ కోసం త్యాగాలు చేసే క్యారెక్టర్. ఏదో సాధిస్తామని ఇంట్లో గొప్పలు చెప్పడం తప్పితే గడ్డిపరక పని కూడా చేయరు. ఇలాంటి విలేజ్ గ్యాంగ్ .. బయటికి వెళ్ళడం ఇష్టం లేక ఊర్లోనే ఒక ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకుంటారు. దాని కోసం గంజాయి స్మగ్లింగ్ రొంపిలోకి దిగుతారు. అప్పుడు వీరి జీవితాలు ఎలాంటి మలపులు తిరిగాయి? ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారు ? పోలీసులు ఎలా వెంటాడారు ? చివరికి వీరి కథ ఎలా ముగుస్తుందనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ:


కథ రాసుకున్నపుడు ఏదైనా ఒక పాయింట్ ని బలంగా చెప్పాలని భావిస్తాడు ఫిల్మ్ మేకర్. బలంగా కాకపోయిన ఒక పాయింట్ ని చూపించే ప్రయత్నం చేస్తాడు. తను అనుకున్న పాయింట్ తెరపైకి వస్తే సినిమా ఖచ్చితంగా ఎంతోకొంత అలరిస్తుంది. అర్జున-ఫల్గుణ లో ఆ పాయింటే  మిస్ అయ్యింది. అసలు కథలో దర్శకుడు స్నేహం గురించి చెప్పాలనుకున్నడా ? ప్రేమ గురించా? స్మగ్లింగా? ఒక పల్లెటూరిని చూపించాలని భావించాడా? అసలు ఇందులో ఏ పాయింట్ కనెక్ట్ చేయాలనుకున్నడో అనేది  ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ ఒక్క పాత్ర కూడా రిజిస్టర్ అవ్వదు. శ్రీ విష్ణు స్నేహుతుల మధ్య ఫ్రండ్ షిప్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేయదు. 


సినిమా ప్రదమార్ధం పాత్రలు, ఫ్రండ్ షిప్ పరిచయాలతోనే సరిపోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, గ్రామ వాలంటీరు ఉద్యోగాలు, ప్రెసిడెంట్ మెడల్ మందు పై సెటైర్లు .. పెద్దగా ఆకట్టుకోవు.  కథ అరకు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం సీరియస్ నెస్ వస్తుంది. అయితే ఆ ఎపిసోడ్ ని కూడా సాగాదీతగా కానించారు. చివరి వరకూ ఏదో ట్విస్ట్ వస్తుందని నమ్మకంతో ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ముందే చెప్పినట్లు ఈ సినిమా పాయింట్ లోనే క్లారిటీ లేదు. అసలు ఈ సినిమాతో ఏ అంశాన్ని చెప్పాలనుకున్నారో స్పష్టత లేకుండా వుంటుంది. దిన్ని కామెడీ అనలేం, సీరియస్ డ్రామా అనలేం, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వదు. శ్రీవిష్ణు కి ఏం చెప్పి ఈ కధని ఒప్పించారో కానీ అనుకున్న పాయింట్ మాత్రం తెరపైకి రాలేదు. పాయింట్ కొత్తగా లేకపోయిన ట్రీట్మెంట్ కొత్తదనం వుంటే సినిమాని నడిపేవచ్చు.. కానీ కథలో ట్రీట్మెంట్ కూడా పాత వాసనే కొడుతుంది. టోటల్ గా అర్జున-ఫల్గుణ మిస్ ఫైర్ డ్రామా నిలిచిపోయింది. 


నటీనటులు:


శ్రీ విష్ణు నటనకి ఎప్పుడూ వంక పెట్టలేం. ఇందులో పాత్రకు కూడా తన వంతు న్యాయం చేశాడు. గోదావ‌రి యాస‌ని భ‌లేగా ప‌లికాడు. తన పాత్రని చాలా నేచురల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. స్నేహితుల గ్యాంగ్‌లో ఉన్నవాళ్లంతా ఓకే.  కానీ వాళ్ళ పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. హీరోయిన్ అమృత అయ్యర్‌ ఓకే.  సుబ్బరాజు. న‌రేష్‌, శివాజీ రాజా పరిధి మేరకు చేశారు.


టెక్నికల్ గా:


నిర్మాణ విలువలు ఉన్నతంగా లేవు. గోదారోళ్లు పాట తప్పా మరో పాట విన‌సొంపుగా లేదు. యాక్షన్ కూడా సోసోగా సాగుతుంది. డైలాగుల్లో  డబల్ మీనింగులు వినిపిస్తాయి. కెమరాపనితనం ఓకే. బడ్జెట్ సమస్య చాలా చోట్ల కనిపిస్తుంది. 


ప్లస్ పాయింట్స్ 


శ్రీవిష్ణు 
గోదారోళ్లు పాట
కొన్ని విలేజ్ కామెడీ సీన్లు


మైనస్ పాయింట్స్


బలహీనమైన కథ
సాగాదీత స్క్రీన్ ప్లే 
ఎమోషన్ మిస్ కావడం 


ఫైనల్ వర్దిక్ట్ : అర్జున-ఫల్గుణ .. హతవిధీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS