సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'జీఎస్‌టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వీడియో విషయమై పోలీసులు కేస్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే విమియో అనే వెబ్‌సైట్ నుండి ఈ వీడియోను తొలగించాలని ఆదేశాలు పంపారు పోలీసులు. దాంతో ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు వెంటనే స్పందించి, జీఎస్‌టీ వీడియోని తమ వెబ్‌సైట్ నుండి తొలగించామని ప్రకటించారు.
అయితే 'విమియో' అనే వెబ్‌సైట్ ఫేక్ వెబ్‌సైట్ అనీ, అదో పైరసీ సైట్ అని వర్మ క్లారిటీ ఇచ్చాడు. అసలు వెబ్‌సైట్ అయిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ డాట్ కామ్' వెబ్‌సైట్‌లో ఈ వీడియో రన్ అవుతుందనీ, ఇది పెయిడ్ వెబ్‌సైట్ అనీ, ఇది అమెరికా నుండి రన్ అవుతుందనీ వర్మ చెప్పాడు. కానీ ఈ మెయిన్ వెబ్‌సైట్ నుండి కూడా వీడియోని తొలగించాలని పోలీసులు హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఈ వీడియో విషయమై మహిళల నుండి వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగి, ఆ వీడియోని సదరు వెబ్‌సైట్ నుండి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారట.
అంతేకాదు, ఈ విషయమై డైరెక్టర్ వర్మని పిలిచి విచారిస్తామనీ ఆయన తెలిపారు. తర్వాత కేసు తీవ్రతను బట్టి వర్మ అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'జీఎస్‌టీ' వీడియో సంచలనాలకు వేదికైన సంగతి తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన ఈ న్యూడ్ వీడియో పట్ట మహిళా సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వర్మపై చీవాట్ల వర్షం కురిపించారు.
అయినా కానీ వర్మ ఈ వీడియోని విడుదల చేశారు. అయితే అనూహ్యంగా ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియో చూసినవాళ్లంతా వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజా కేసుతో వర్మ ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలిక.