సీనియర్ నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య

మరిన్ని వార్తలు

సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే, నటి అన్నపూర్ణ కూతురు కీర్తి ఈరోజు తెల్లవారుజామున తన ఇంటిలో బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ లో తన భర్తతో కలిసి ఉంటుంది. అయితే కీర్తి ఆత్మహత్యకి పాల్పాడడానికి ముఖ్య కారణం తన కూతురికి మాటలు సరిగా రాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకి గురై ఇలా చేసింది అని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఇక కీర్తి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్కనే ఉంటున్న అన్నపూర్ణ ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కి గురైంది. కూతురి ఆరోగ్య స్థితి మెల్లగా కుదుటపడుతుంది అని ఎన్ని సార్లు నచ్చజెప్పినా వినకుండా ఈ దారుణానికి పాల్పడింది అని అన్నపూర్ణ కన్నీటిపర్యంతమయింది.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS