క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఈమె త్వరలో బుల్లితెరపై ప్రసారం కానున్న 'బిగ్‌బాస్ 3'షోలో పార్ట్ కానున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఆమె 'బిగ్‌బాస్ 3' వివాదాలపై తనదైన శైలిలో స్పందించారు. ఈ షో నిర్వహణను తప్పు పడుతూ, శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా తదితరులు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హేమ కాస్త ఘాటుగా స్పందించారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేవీ బిగ్‌బాస్ 3ని ఆపలేవనీ, సెలెక్ట్ చేయలేదన్న కారణంగా సదరు వ్యక్తులు ఈ షోపై నెగిటివ్‌గా ప్రచారం చేయడం సబబు కాదనీ, అయినా, నెల రోజులు ముందు జరిగిన ఇష్యూని పట్టుకుని ఇప్పుడు బయటికి రావడం ఏమీ బాగా లేదనీ, నిజంగానే అలా జరిగితే, జరిగిన రోజే బయటికి రావాలనీ, మీడియా ముందు నిలదీయాలని.. నేనైతే అలాగే చేస్తానని ఆమె చెప్పారు. అంతేకాదు, బిగ్‌బాస్ 3లో అవకాశం వస్తే, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని హేమ తెలిపారు. మరోవైపు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారన్న వార్త హల్‌చల్ చేసింది. ఆ క్రమంలో బిగ్‌బాస్‌పై తాజాగా ఆమె స్పందించిన తీరు, ఇటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో ఆమె పేరునూ, అలాగే భవిష్యత్‌లో తానూ రాజకీయాల్లో భాగం కానున్నానన్న న్యూస్‌నీ ఒకేసారి కన్‌ఫామ్ చేసినట్లే అనిపిస్తోంది.
హేమ స్పందన ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా అంది. అంతేగా, బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తే, ఎవరెవరికి ఎంతెంత ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిపోతుంది. అది ఆమె రాజకీయ భవిష్యత్తుకి ఎంత పనికొస్తుందన్న విషయం పక్కన పెడితే, ఆ ఫాలోయింగ్ భవిష్యత్తులో తన రాజకీయ తెరంగేట్రానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆమె భావిస్తున్నట్లు అయితే కనిపిస్తోంది. అందుకే ఒకవేళ తాను బిగ్‌హౌస్‌లో ఉంటే, తనకు మద్దతివ్వడం మర్చిపోకండి అంటూ హేమ ఫ్యాన్స్‌కి ఓ చిన్న రిక్వెస్ట్ కూడా పెట్టేసింది.