అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా చుట్టూ ఏదో ఒక మూల నుండి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ తలకు మించిన వివాదాలు తలెత్తుతుండడంతో 'ఆమె' టీమ్ కాస్త ఆందోళన చెందుతోందట. తాజాగా 'ఆమె' సినిమాని మహిళలే వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాలో న్యూడ్ సన్నివేశాలు, అమలాపాల్ క్యారెక్టర్ డిజైన్ యువతను పక్కదోవ పట్టించేలా ఉందంటూ తమిళనాడు మహిళా మంత్రి ప్రియా రాజేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాదు, ఆమె అమలాపాల్‌ని పర్సనల్‌గా కూడా ధూషించారు. అమలాపాల్ పుదుచ్చేరి నుండి వచ్చిందనీ, ఆమెకు తమిళనాడు సంస్కృతీ సాంప్రదాయాలపై గౌరవం లేదనీ, కేవలం డబ్బుల కోసమే యాక్టింగ్ చేస్తోందనీ ఆరోపించారు. ఈ సినిమాకి ఎలాగూ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు కనుక, న్యూడ్ పోస్టర్స్‌తో ప్రమోషన్స్ చేయడం ఆపాలనీ ఆమె కోరారు. అంతేకాదు, అమలాపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారట కూడా ప్రియా రాజేశ్వరి.
రేపు అనగా శుక్రవారం 'ఆమె' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'అడాయ్'గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'ఆమె'గా విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా, అమలాపాల్, తన సహనటి రమ్యని ముద్దు పెట్టుకోవడాన్ని కూడా వక్రీకరిస్తున్నారు ఓ వర్గం ప్రేక్షకులు. సో ఇలా 'ఆమె'గా అమలాపాల్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. కానీ, సినిమా విజయంపై ఆమె పక్కా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి, విడుదల తర్వాత 'ఆమె'కు దక్కేవి ప్రశంసలా.? విమర్శలా.?