'కంగనా'కి అరవింద స్వామి సెట్ అవుతాడా?

మరిన్ని వార్తలు

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవిత కథ ఆధారంగా, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఎం.జి.ఆర్ (మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతాడా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి అరవింద స్వామి కంగనా సరసన ఎలా ఉంటారో చూడాలి.

 

జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకున్న ఈ బాలీవుడ్ క్వీన్.. బరువు కూడా పెరుగింది.. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగిందట. ఇక ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లుతో రూపొందుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS