రానా 'విరాటపర్వం'లో ఇంట్రస్టింగ్ కోణాలు !

మరిన్ని వార్తలు

'నీది నాది ఒకే కథ' అనే చిన్న కథలో కొత్త సంఘర్షణను జోడించి హిట్ ను  అందుకున్నాడు డైరెక్టర్  'వేణు ఉడుగుల'.  అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన రెండో సినిమాగా  రానా, సాయిప‌ల్ల‌విలను   హీరోహరోయిన్లుగా పెట్టి  'విరాటపర్వం' అనే పొలిటికల్‌ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి  తెలిసిందే. కాగా పేరుకు  పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా కథలో మాత్రం కొత్త కోణాలు చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయట.

 

 ముఖ్యంగా  రానా పాత్రలో  కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని.. అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా మంచి కోసం పోరాడే  ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ అంశాలతో  ఓ కొత్త కోణంలో  దర్శకుడు చెప్పబోతున్నట్లు  తెలుస్తోంది.  

 

కాగా తెలంగాణ ప్రాంతంలోని  1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా  పీరియాడిక్ సోషల్ డ్రామాగా  ఈ మూవీ రానుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేయనున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్య చిత్రాన్ని ప్రారంభించనున్నారట.

 

నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో  రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది.  అయితే  సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం.  కానీ, రానాకి  సంబంధించిన సీన్స్ షూట్  చేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS