అరెరె అల్లరోడి అన్న విలన్‌ కాదంట.!

మరిన్ని వార్తలు

హీరోగా తెరంగేట్రం చేసి ఒకటి రెండు సక్సెస్‌లు అందుకున్నా, తర్వాత హీరోయిజం చూపించడంలో విఫలమై, వెండితెర నుండి కొంచెం దూరంగా మసలుతున్న యంగ్‌ హీరోలు ప్రజెంట్‌ ట్రాక్‌ మార్చి విభిన్న పాత్రల్లో కనిపించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అది నెగిటివ్‌ షేడ్‌ క్యారెక్టర్స్‌ అయినా ఇట్టే ఓకే చెప్పేస్తున్నారు. 

అలా ఈ మధ్య తారకరత్న, ఆది పినిశెట్టి తదితర యంగ్‌ హీరోలు విలన్స్‌గా తమ సత్తా చూపించారు. ఇలా సక్సెస్‌ అయ్యాక హీరోలుగానూ మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే కోవలో యంగ్‌ హీరో ఆర్యన్‌ రాజేష్‌ కూడా పయనించబోతున్నాడన్న ప్రచారం జరిగింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆర్యన్‌ రాజేష్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. 

దాంతో ఆర్యన్‌ రాజేష్‌ హీరోగానో, ఇంకో రకంగానో బౌన్స్‌బ్యాక్‌ అవుతాడని అంతా భావించారు. అయితే బౌన్స్‌బ్యాక్‌ సంగతి అటుంచితే, చరణ్‌ సినిమాలో ఆర్యన్‌ విలన్‌ అయితే కాదనీ తేలిపోయింది. ఆర్యన్‌ రాజేష్‌ తమ్ముడు అల్లరి నరేష్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. విలన్‌ కాదు కానీ, ఆర్యన్‌ పాత్ర ఖచ్చితంగా అందరూ మెచ్చే పాత్ర అవుతుందట. 

ఇటీవల నరేష్‌ నటించిన 'సిల్లీ ఫెలోస్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పోజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. సునీల్‌ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాడు. ఇద్దరికీ ఈ సినిమా రిజల్ట్‌ పోజిటివ్‌గానే వచ్చినట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS