వెండితెరపైకి మరో వారసుడొచ్చేస్తున్నాడు

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి ఎంతోమంది తారలు వచ్చారు, వస్తూనే వున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ నట వారసత్వాన్ని నిలబెడుతూ ఈ తరానికి సూపర్‌ స్టార్‌గా మహేష్‌బాబు ఎదిగిన విషయం విదితమే. మహేష్‌ తనయుడు కూడా అప్పుడే తన తండ్రి బాటలోనే బాల నటుడిగా తన ఉనికిని చాటుకున్నాడు. 

కృష్ణ మరో సోదరుడు రమేష్‌బాబు గతంలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ కుమార్తె మంజుల నటిగా పలు సినిమాల్లో నటించి, దర్శకత్వం వైపు మళ్ళారు.. నిర్మాతగానూ రాణిస్తున్నారు. కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు, తెలుగులో ప్రముఖ యంగ్‌ హీరో అని అందరికీ తెలుసు కదా. 

లేటెస్ట్‌గా కృష్ణ మరో అల్లుడు గల్లా జయదేవ్‌ కుమారుడైన గల్లా అశోక్‌ హీరోగా సినిమా ప్రారంభమయ్యింది. 'అదే నువ్వు అదే నేను' అనే పేరుని ఈ సినిమాకి టైటిల్‌గా నిర్ణయించారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాలో సుధీర్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించిన నభా నటేస్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. హిప్‌ హాప్‌ తమిఝ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, కొత్త దర్శకుడు శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. 

డాన్సులు, ఫైట్స్‌, నటనలో ఇప్పటికే అశోక్‌ గల్లా శిక్షణ తీసుకున్నాడు. నిజానికి గల్లా జయదేవ్‌కి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక వుండేదట. వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోవడం, రాజకీయ రంగం వైపు వెళ్ళడం ద్వారా గల్లా జయదేవ్‌ ఆ కోరికను తీర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS