లేటెస్ట్గా విడుదలైన 'అశ్వత్థామ' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 4.1 మిలియన్ వ్యూస్ సాధించి యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాడు 'అశ్వత్థామ'. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా తయారు చేసిన ఈ స్క్రిప్ట్‌ని రచయిత నాగశౌర్యే కావడం విశేషం. అంతేకాదు, పక్కింటబ్బాయ్లా, చాక్లెట్ బోయ్‌లా కనిపించే నాగశౌర్య మాస్ హీరో అవతారమెత్తాడు ఈ సినిమాతో.
నాగశౌర్య కెరీర్‌కి ఇదో పెద్ద సాహసమే అని చెప్పాలి. అయితే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ఫస్ట్ టీజర్‌తోనే పోజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాడు 'అశ్వత్ధామ'. సో నాగశౌర్య ప్రయోగం ఫలించేలానే ఉంది. ఈ సినిమాలో సిట్యువేషనల్‌గా వచ్చే యాక్షన్ సీన్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారట. అంతేకాదు, ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకున్ని ఉత్కంఠగా కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయని చిత్ర యూనిట్ అంటోంది. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో రూపొందుతోన్న 'అశ్వత్ధామ' జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్గా అందాల భామ మెహ్రీన్ కౌర్ నటించింది.