చిరంజీవి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ జగదేక వీరుడు - అతిలోక సుందరి. సోషియో ఫాంటసీ సినిమాల్లో అదో మణిహారం. వైజయంతీ మూవీస్ సంస్థ ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే సినిమా అది. దీనికి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ విషయాన్ని అశ్వనీదత్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ఇప్పుడు మరోసారి.. ఈ సీక్వెల్ పై తన మనసులోని భావాల్ని ఆయన పంచుకొన్నారు.
``జగదేక వీరుడు - అతిలోక సుందరి సీక్వెల్ గానీ, రీమేక్ గానీ చేయాలని ఉంది. అది చిరంజీవితో చేస్తానా? చరణ్ తో చేస్తానా? అనేది ఇంకా తెలీదు.. ఈ కథపై వర్క్ చేయమని నాగ అశ్విన్ కి చెప్పాను. రాఘవేంద్రరావుతో కలిసి ఈ స్క్రిప్ట్ పై తను పని చేస్తాడు. ఈ కథ ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. అనుకొన్నది అనుకొన్నట్టుగా వస్తే.. తప్పకుండా ఈ సినిమాని పట్టాలెక్కిస్తా`` అన్నారాయన.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవితో ఈ సీక్వెల్ ఊహించడం కష్టమే. నూటికి 90 శాతం ఈ సీక్వెల్ చరణ్‌తోనే పట్టాలెక్కుతుంది. అయితే.. నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కెపై దృష్టి పెట్టాడు. 2024లో ఈ సినిమాని విడుదల చేస్తారు. ఆ తరవాతే... ఈసీక్వెల్ గురించి ఆలోచించాలి.