ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి' మూవీ వసూళ్ల జాతర ఇంకా కొనసాగుతోంది. వారం రోజులు అయినా ఇంకా ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఇప్పటికి 700 కోట్లు కలక్ట్ చేసి, 1000 కోట్ల మార్కెట్ వైపు పరుగులు తీస్తోంది. ఒక్క భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి రికార్డ్స్ ముందు ఖాన్ ల రికార్డ్స్ బలాదూర్ అయిపోయాయి. అవన్నీ చూసి భరించలేని బాలీవుడ్ మీడియా ఏడుపు మొదలు పెట్టింది. అసలు చాలా రోజులుగా బాలీవుడ్ లో సరైన హిట్ లేదు. నష్టాలు తప్ప, లాభాల ఊసే లేదు. హీరోలు, హీరోయిన్స్, అంతా సౌత్ వైపు చూస్తున్నారు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేట్టు ఉండేది. కానీ ఇప్పడు బడా హీరోల సినిమాలకి కూడా ఓపెనింగ్స్ రావటం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'బడే మియా - చోటే మియా ' అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోలున్నా మొదటిరోజు కూడా ఓపెనింగ్స్ రాలేదు. పైగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. జవాన్ తరవాత బాలీవుడ్ కి సరైన హిట్ లేదు. ఇంకో వైపు తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతున్నాయి, దీనితో టాలీవుడ్ పై బాలీవుడ్ మీడియా అక్కసు వెళ్లగక్కుతుంది.
రీసెంట్ గా కల్కి మూవీ హిట్ కావటంతో మళ్ళీ ఇంకో సారి ఈ ఏడుపు బయటపెడుతున్నారు. బాలీవుడ్ కు చెందిన కమల్ ఆర్ ఖాన్ తరచుగా టాలీవుడ్ సినిమాల్ని, హీరోలని టార్గెట్ చేసి పోస్ట్ లు పెడుతుంటాడు. ఇప్పడు కూడా తన X ఖాతాలో "కల్కి కంటే 'బ్రహ్మాస్త్రం' సినిమా 20 రెట్లు బాగుందని నేను బల్ల గుద్ది చెప్తున్నా, జనాలు కల్కిని చూస్తున్నారు కానీ, బ్రహ్మాస్త్రం మూవీని చూడలేదంటే, వారు నిజంగా బాలీవుడ్‌ను ద్వేషిస్తున్నారు" అని సౌత్ ఆడియన్స్ మీద నిందలు వేస్తూ నార్త్ ఆడియన్స్ ని కట్టడి చేయాలని, సౌత్ పై ద్వేషం పెంచేలా కామెంట్స్ చేశాడు. ఒక తెలుగు సినిమా హలీవుడ్ రేంజ్ లో టాక్ తెచుకోవటం భరించలేక KRK ఇలాంటి చీఫ్ కామెంట్స్ చేస్తున్నారని ఫాన్స్, సినీప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.