అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో అవసరాల క్యారెక్టర్ ఏంటనుకుంటున్నారా? అమ్మాయి కనిపించిందంటే మనోడి ఒళ్లో వాలిపోవాల్సిందే. అదే అవసరాల క్యారెక్టర్. తన మాటల్తో మాయ చేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దించేస్తుంటాడు అవసరాల శ్రీనివాస్. అందుకే మన బాబు చాలా బిజీ. ఒక్క అమ్మాయిని మేనేజ్ చేయడమే చాలా కష్టం..అలాంటిది అంత మంది అమ్మాయిలా.. బాబోయ్ అనుకుంటున్నారా! అదేనండీ మరి ఈ సినిమా స్పెషల్. బాలీవుడ్ సినిమా 'హంటర్'కి తెలుగు రీమేకే ఈ సినిమా. 'బాబు బాగా బిజీ' అంటే ఏదో అనుకున్నారు. టీజర్ వచ్చాక తెలిసింది. బాబు ఏ విషయంలో బిజీనో. ఈ సినిమాలో చాలా గ్లామర్ ఉందండీ బాబూ.. మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, తేజస్విని, సుప్రియ తదితర ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అవసరాల అంటూ ఇంతవరకూ కమెడియన్‌గానూ, డైరెక్టర్‌గానూ మాత్రమే తెలుసు. కానీ ఈ సినిమాతో అవసరాల శ్రీనివాస్‌లోని మరో యాంగిల్ కనిపించనుంది నటన పరంగా. మరి ఈ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో అవసరాలని ఎంతవరకూ ఆదరిస్తారో ప్రేక్షకులకే వదిలేయాలి. ఎందుకంటే కాన్సెప్ట్ అంగీకరించే విధంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అలాగనీ గతంలో సుమంత్ హీరోగా వచ్చిన 'నరుడా డోనరుడా' సినిమాకి అంతగా ఆదరణ లభించలేదు. మరి ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలంటే సినిమా చూస్తే గానీ తెలీదు. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల కానుంది.