'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుల బొద్దుగుమ్మ అవికాగోర్. అయితే, అంతకు ముందే 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ఇంటింటికీ, గడప గడపకీ సుపరిచితురాలు అవికా గోర్. హీరోయిన్గా తొలి సినిమాతోనే క్యూట్ హిట్ కొట్టింది. తర్వాత 'సినిమా చూపిస్త మామా' తదితర సినిమాల్లో నటించింది. కానీ, స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఓ తెగ పీకేసిందేమీ లేదు కానీ, ఓ హీరోతో లవ్, డేటింగ్ అంటూ పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు ఓంకార్ 'రాజుగారి గది 3' కోసం మళ్లీ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదిగో ఇలా రెడ్ హాట్ మోడ్రన్ డ్రస్‌లో తళుక్కున మెరిసింది. కుచ్చుల స్లీవ్స్‌తో క్యూట్ ఫీచర్స్‌తో అందమైన నడుమును ఎక్స్పోజ్ చేస్తూ, సరికొత్తగా ఆకట్టుకుంటోంది. 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో కన్నా, క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో కనిపిస్తోంది ఈ పిక్‌లో. అవిక తాజా లుక్స్‌కి అవకాశాలు జోరందుకోవడం ఖాయమనిపిస్తోంది. ఇంతకీ అవికా ఫీచర్స్‌లో వచ్చిన మార్పు గమనించారా.? ఆమె ఐబ్రోస్ కలిసిపోయి ఉంటాయి. వాటిని విడగొట్టి షేప్ చేయడంతో ఆమె అందం రెట్టింపయినట్లు కనిపిస్తోంది.